Thursday, 12 December 2024 02:14:54 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Pendyala Srinivas: చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ పై సస్పెన్షన్ ఎత్తివేత.. సస్పెన్షన్ కాలం ఆన్ డ్యూటీగా మార్పు

Date : 10 September 2024 04:26 PM Views : 29

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబుకు పీఎస్ గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాసరావుపై ఉన్న సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై ఉన్న విచారణను సైతం ఆపేశారు. సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు పీఎస్ గా 15 ఏళ్లకు పైగా పెండ్యాల పని చేశారు. వైసీపీ హయాంలో 4 సార్లు ఆయన సీఐడీ విచారణను ఎదుర్కొన్నారు. 2023 సెప్టెంబర్ 29న అప్పటి వైసీపీ ప్రభుత్వం పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. 2023 అక్టోబర్ 26న ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. విధులకు గైర్హాజరు అయ్యారని, అనుమతులు లేకుండానే దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లారని ఆయనపై అభియోగాలు మోపారు. ఈ క్రమంలో, 2024 జనవరి 8న పెండ్యాల శ్రీనివాస్ పై విచారణ జరిపేందుకు విచారణాధికారిని నియమించారు. 2024 ఆగస్ట్ 1న విచారణాధికారి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. శ్రీనివాస్ పై ఉన్న అభియోగాలు కొంత వరకు నిరూపితమయ్యాయని సదరు విచారణాధికారి తన నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ పై ఉన్న సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. శ్రీనివాస్ పై కొన్ని అభియోగాలు కొంత వరకు నిరూపితమయ్యాయన్న విచారణ నివేదికలోని అంశంపై స్పందిస్తూ... మరోసారి అలాంటివి పునరావృతం కాకూడదని శ్రీనివాస్ కు సూచించింది. ఆయనను విధుల్లోకి తీసుకుంటున్నట్టు జీవోలో పేర్కొంది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఆయనను నియమించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు