Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : బీజేపీ ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఇప్పుడు పనిచేసే సీఎం చంద్రబాబును చూస్తున్నామని అన్నారు. గతంలో పని చేయడం తెలియని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని దినకర్ తెలిపారు. చంద్రబాబు పనితీరు భేష్ అని కితాబు నిచ్చారు. "గతంలో పంచాయతీలకు నిధులివ్వని మంత్రిని చూశాం. రాష్ట్రంలో ఇప్పుడు నికార్సయిన పంచాయతీరాజ్ మంత్రిని చూస్తున్నాం. గతంలో విద్యను అమ్ముకున్న వ్యక్తి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వెంటనే స్పందించే విద్యాశాఖ మంత్రిని చూస్తున్నాం. ప్రస్తుతం ఓపికతో పని చేస్తున్న వైద్య, ఆరోగ్య మంత్రిని చూస్తున్నాం. గతంలో నిస్సహాయ మంత్రిని చూశాం. రాష్ట్రంలో ఇప్పుడు నిలబడి పనిచేసే జలవనరుల శాఖ మంత్రిని చూస్తున్నాం" అని లంకా దినకర్ ప్రశంసించారు.
Admin
Studio18 News