Thursday, 12 December 2024 01:05:45 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

YSRCP: ఆ బోట్లు టీడీపీ వాళ్లవే: వైసీపీ

Date : 10 September 2024 01:07 PM Views : 35

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ప్రకాశం బ్యారేజీకి హాని కలిగించాలనే ఉద్దేశంతో వైసీపీ వారే కుట్ర పూరితంగా కృష్ణానదిలోకి ఐదు బోట్లు వదిలారని సీఎం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ స్పందిస్తూ ఆ బోట్లు టీడీపీ వారివేనని పేర్కొంది. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు టీడీపీ నేతలకు సంబంధించిన వారేనని పేర్కొంటూ వైసీపీ ట్వీట్ చేసింది. నిందితుల్లో ఒకరైన కోమటి రామ్మోహన్ .. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం అధిపతి కోమటి జయరామ్‌కు బంధువు అని వైసీపీ పేర్కొంది. ఇక రెండో నిందితుడు ఉషాద్రి కూడా టీడీపీకి చెందిన వ్యక్తేనని, అతను నారా లోకేశ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయని చెప్పింది. ఆ బోట్లు నడిపింది కూడా అతనేనని చెప్పింది. కోమటి రామ్మోహన్ మైలవరం టీడీపీ టికెట్ ఆశించిన టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుకి అత్యంత సమీప బంధువు అనే విషయం బయటపడే సరికి మీ డ్రామా మొత్తం రివర్స్ అయిపోయిందని విమర్శించింది. చంద్రబాబు, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావుతో కోమటి రామ్మోహన్ కి ఎంత సాన్నిహిత్యం ఉందో ఈ ఫోటోలను చూస్తేనే అర్ధం అవుతుందని వైసీపీ పేర్కొంది. అడ్డంగా దొరికిపోయాక ఇంకెందుకు ఈ బుకాయింపులు? అని ప్రశ్నించింది. నిన్న టీడీపీ చేసిన ట్వీట్‌కు రిప్లైగా వైసీపీ కౌంటర్ ఇస్తూ టీడీపీ నేతలతో నిందితుడు ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు