Studio18 News - ANDHRA PRADESH / : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జనసేన జెండాపై వైసీపీ యూత్ లీడర్ హర్ష మూత్రం పోసి అవమానించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అరిగిపల్లి సెంటర్ లో అర్ధరాత్రి మద్యం సేవించి తన ఫార్చ్యూనర్ కారులో బెజవాడకు హర్ష వెళ్తున్నాడు. కారులో వెళ్తున్న ఆయన రివర్స్ లో వచ్చి రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న జనసేన నేత ముక్కు మహేశ్ (అరిగిపల్లి జనసేన ఉపాధ్యక్షుడు) కారుపై ఉన్న పార్టీ జెండాపై మూత్రం పోశాడు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే, ఆలస్యంగా ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనపై సాక్ష్యాధారాలతో పోలీసులకు ముక్కు మహేశ్ ఫిర్యాదు చేశారు. మహేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నూజివీడు ఇన్చార్జ్ డీఎస్పీ శ్రవణ్, సీఐ రామకృష్ణ విచారణ చేపట్టారు.
Admin
Studio18 News