Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవలసిందే. దసరా కూడా రాకుండానే.. ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉండగానే హైదరాబాద్ నుంచి ఏపీకి దారితీసే రైళ్ల రిజర్వేషన్లు అన్నీ ఫుల్ అయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 11న హైదరాబాద్ నుంచి వెళ్లే విశాఖ, గోదావరి, ఫలక్‌నుమా, కోణార్క్ తదితర రైళ్లకు నిన్న ఉదయం 8 గంటలకు రిజర్వేషన్లు ప్రారంభం కాగా, కేవలం ఐదు నిమిషాల్లోనే అంటే 8.05 గంటలకే మొత్తం బెర్త్‌లు నిండిపోయాయి. ఆ తర్వాత ప్రయత్నించిన ప్రయాణికులకు నిరాశ తప్పలేదు. సంక్రాంతికి ఇంకా నాలుగు నెలల ముందే రిజర్వేషన్లు నిండిపోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Admin
Studio18 News