Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ నేడు పర్యటించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద కారణంగా అతలాకుతలమైన గ్రామాల్లో జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జగన్ పిఠాపురంకు చేరుకుంటారు. అక్కడి నుంచి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురంకు వెళ్తారు. అక్కడ వరద బాధితులతో ఆయన మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి యు.కొత్తపల్లి మండలం నాగులపల్లికి వెళ్తారు. ఆ తర్వాత రమణక్కపేటకు వెళ్లి వరద బాధితులను పరామర్శిస్తారు. అనంతరం పిఠాపురం చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. గత ఎన్నికల తర్వాత జగన్ తొలిసారి కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. మరోవైపు, విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో కూడా ఇటీవల జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అలసత్వం వల్లే విజయవాడను వరద ముంచెత్తిందని ఆయన విమర్శించారు.
Admin
Studio18 News