Friday, 13 December 2024 09:51:31 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

CM Chandrababu Naidu : ఉత్తరాంధ్రలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన.. కొల్లేరులో ఏరియల్ వ్యూ

Date : 11 September 2024 12:01 PM Views : 42

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : CM Chandrababu Tour in Godavari Districts : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించనున్నారు. కొల్లేరు, ఉప్పటేరులలో వరద ఉధృతిని, ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర వరదల్లో చిక్కుకుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు మూడునాలుగు రోజులు భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. విజయవాడలో ఎంత నష్టం వాటిల్లిందో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనూ భారీ వర్షాల కారణంగా అంతే నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. కొల్లేరు ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. బుడమేరు పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నీరంతా దిగువున ఉన్న కొల్లేరుకు చేరింది. కొల్లేటి సరస్సులో నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు ఉండగా.. దీనికి మించి వరద కొల్లేరులోకి చేరడం, పెద్ద సంఖ్యలో లంక గ్రామాలు ముంపులో చిక్కుకుని ప్రజలు భారీ నష్టాన్ని చవిచూశారు. చేపల చెరువులు ముంపునకు గురయ్యాయి. ఆయా గ్రామాలకు ప్రజలు పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో కైకలూరు పరిధిలో నష్టపోయిన కొల్లేరు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. ఉదయం 10గంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్ లో సీఎం చంద్రబాబు బయలుదేరుతారు. 10.50 గంటలకు ఏలూరు జిల్లా కైకలూరు, కొల్లేరు ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తారు. 11.30 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో కొల్లేరు ప్రాంతంలోని ఉప్పుటేరు వంతెన వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1.05 గంటలకు కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 1.45 గంటల వరకు విరామం తీసుకొని రోడ్డు మార్గంలో కిర్లంపూడి మండలంలోని ముంపు ప్రాంతమైన రాజుపాలెం వెళ్తారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకు అక్కడ పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకుంటారు. సామర్లకోటలోని టీటీడీసీకి చేరుకొని వరద ప్రాంతాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను చంద్రబాబు నాయుడు తిలకిస్తారు. వరద తాజా పరిస్థితి, సహాయక చర్యలపై కీలక శాఖల అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి వెలంపూడి చేరుకుంటారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు