Sunday, 08 March 2026 03:51:55 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Amalapuram: అమలాపురంలో ఓ ఇంట్లో భారీ పేలుడు.. ధ్వంసమైన రెండు అంతస్తుల భవనం

Date : 16 September 2024 01:47 PM Views : 572

Studio18 News - ANDHRA PRADESH / : Firecrackers Explosion: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా త‌యారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురికి గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను స్థానికులు వెంట‌నే చికిత్స నిమిత్తం ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అమలాపురం పట్టణం రావులచెరువులోని బాణసంచా కేంద్రంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బాణాసంచా పలుడు దాటికి రెండు అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలుకాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం కొందరిని కిమ్స్ కు తరలించారు. దీపావళి మందు గుండు సామాగ్రికి తయారీలో వినియోగించే మందుతో ప్రమాదం జ‌రిగిందని తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న అమ‌లాపురం పోలీసులు ఘ‌ట‌న స్థ‌లికి చేరుకొని ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఘటనా స్థలిని జిల్లా ఎస్పీ కృష్ణారావు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు ఘటన స్థలికి చేరుకొని స్థానికుల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని వైద్యుల‌కు సూచించారు. ఇదిలాఉంటే.. పేలుడుదాటికి స్థానిక ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంత‌ల‌కు గుర‌య్యారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :