Studio18 News - జాతీయం / : రెండేళ్ల క్రితమే పెళ్లి జరిగిన అమ్మాయిని ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపాడు ఆమె భర్త. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహలో చోటుచేసుకుంది. తనకు కట్నంగా టీవీఎస్ అపాచీ, రూ.3 లక్షలు ఇవ్వకపోవడతోనే ఆ యువకుడు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. బైఖేడా గ్రామానికి చెందిన సుందర్‌కు మీనా అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి కట్నం డిమాండ్ చేస్తున్నాడు. అతడు తనను వేధిస్తున్నాడని మీనా తన తండ్రితో చెప్పింది. రక్షాబంధన్ నుంచి మీనా సోహర్కాలోని తన తల్లిదండ్రుల ఇంట్లోనే నివసిస్తోంది. అత్తమామల ఇంటికి వెళ్లి సుందర్ తన భార్యను చూసి వచ్చేవాడు. అలాగే, అత్తమామల ఇంట్లో భోజనం కూడా చేసేవాడు. ఆదివారం రాత్రి కూడా తన భార్యను చూసి, ఆమెను ఒప్పించి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కట్నం కోసం గొడవ పెట్టుకున్నాడు. ఆమెపై కర్రలతో దాడి చేసి, గొంతునులిమి చంపి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీనా తండ్రి విజయ్ ఖడక్ బన్షీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన కూతురి భర్త, అతని తల్లి, సోదరి, మరో నలుగురిపై కేసు నమోదు చేయించాడు.
Admin
Studio18 News