Friday, 13 December 2024 09:22:20 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

IMD: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Date : 09 September 2024 03:36 PM Views : 55

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో పెనుగాలులు వీస్తున్నాయని చెప్పారు. ఒడిశాలోని పూరి తీరానికి 50 కి.మీ. దూరంలో గంటకు 10 కి.మీ. వేగంతో వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని వివరించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తాయని వివరించారు. సోమవారం సాయంత్రానికి పూరి వద్ద వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి, గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ పోర్టులలో మూడో నెంబర్ ప్రమాద సూచికను జారీ చేశారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయని, వాయుగుండం ప్రభావంతో వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని, లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఘాట్ రోడ్ లలో ప్రయాణించవద్దని వాహనదారులను హెచ్చరించారు. పలు ఘాట్ రోడ్ లలో వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. కుమ్రంభీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు