Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో, నూతన మద్యం విధానంపై అధ్యయనానికి ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానంపై ఈ కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరపనుంది. అంతేకాకుండా, తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. ఇప్పటికే అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి రూపొందించిన నివేదికను ఈ సబ్ కమిటీ పరిశీలించనుంది. నూతన మద్యం విధానంపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది.
Admin
Studio18 News