Monday, 02 December 2024 12:58:29 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

AP Rains : బలహీన పడిన తీవ్ర వాయుగుండం.. ఆ ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన

Date : 10 September 2024 11:56 AM Views : 78

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీన పడింది. రాబోయే 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా ఛత్తీస్ గఢ్ వైపు వాయుగుండం ప్రయాణిస్తుంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. మంగళవారం ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను వణికించింది. ఇవాళ కూడా వర్షాలు పడుతుండటంతో అల్లూరి జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో వాగులువంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోకి రాకపోకలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్ లో వాహనాల రాకపోకల నిషేధం కొనసాగుతుంది. రిజర్వాయర్లకు వరద తాకిడితో రైవాడ మినహా అన్ని జలాశయాల గేట్లను ఎత్తారు. నదులు, వాగులు వరదతో పోటెత్తాయి. దీంతో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 3,500 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వాగులు పొంగి పొరులుతున్నాయి. నాగావళి, వంశదార నదులకు భారీగా వరదనీరు చేరుతుంది. రెల్లిగెడ్డ, అదపాక గెడ్డ, సాయన్న గెడ్డ వరద ఉధృతికి అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రెల్లి గెడ్డ వరదతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. పొలాకి మండలంలో తంపర భూముల్లోకి వరద నీరు చేరింది. సుసారం, పిన్నింటిపేట మధ్య ఐదు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఒరిస్సాలో వర్షాలకు గొట్టా బ్యారేజ్ కు వరదనీరు చేరుకుంటుంది. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత్స్యాకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పోలవరం వద్ద గోదావరికి మళ్లీ వరద పెరుగుతుంది. శబరి నది నుంచి వస్తున్న వరదతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న కుక్కునూరు, వేలేరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరికి వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో కుక్కునూరుకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు