Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తెలంగాణ టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేశ్‌గౌడ్ గత రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఇంటి వద్దనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం తరపున, సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థిగా గతంలో పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సెల్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన ఆయన ఇటీవలే మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. అనారోగ్యం బారినపడిన ఆయన ఇంటివద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గత రాత్రి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్వస్థలం గాజులరామారంలో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
Admin
Studio18 News