Monday, 02 December 2024 01:26:57 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

వాళ్లు నా పట్ల నీచంగా ప్రవర్తించారు.. నా కేసును రాజకీయాలతో ముడి పెట్టకండి : నటి కాదంబరీ జత్వానీ

Date : 09 September 2024 04:36 PM Views : 40

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Kadambari Jethwani : కొందరు ఐపీఎస్ అధికారులు నాపట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరీ జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో అక్రమంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆనాటి పోలీసు అధికారులు విద్యాసాగర్ కు ఎందుకు కొమ్ముకాశారని ప్రశ్నించారు. వరదల వల్ల పోలీసులు చాలా బిజీగా మారిపోయారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉందని జత్వానీ అన్నారు. నాపై సోషల్ మీడియాలో నీచంగా ప్రచారం చేస్తున్నారు. నా కేసును రాజకీయాలతో ముడి పెట్టకండి. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వారికి శిక్ష పడేలా చూడండని విజ్ఞప్తి చేశారు. నాకు అండగా నిలిచిన మహిళా సంఘాలందరికీ జత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంఘం నేత దుర్గా భవాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు భారతదేశంలో కూడా మొత్తం ఈ కేసు గురించి తెలుసు. ఈ జత్వాని కేసులో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరికీ తెలుసు. స్పెషల్ ప్లైటులో ముంబై వెళ్లి నటి జత్వానిని తీసుకొచ్చారంటే ఎంత పలుకుబడి ఉపయోగించారో మనమందరం తెలుసుకోవచ్చు. పొలిటికల్ ఎంక్వాయిరీ అనేది ఎంత వరకు కరెక్ట్? జ్యుడీషియల్ ఎంక్వెయిరి వేయాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. పారిశ్రామిక వేత్త ఎక్కడో ముంబైలో ఉండి ఆమెని లొంగతీసుకున్నారు. అనేక రకాలుగా వేధించి ఇబ్బందులకు గురిచేశారు. ఆనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని ఒక మహిళను ఎన్నో రకాలుగా చిత్ర హింసలు చేశారు. జత్వాని అరెస్టు వెనక పెద్ద కుట్ర దాగిఉంది. సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి రాష్ట్రానికి తీసుకొచ్చారు. జత్వాని కేసు మీద జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా న్యాయం చేయాలి. ఇంత వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. జత్వానికి మహిళా సంఘాల ఆధ్వర్యంలో కలిసి మద్దతు తెలుపుతున్నాం. దోషులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపర్చాలని సుంకర పద్మశ్రీ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు