Studio18 News - తెలంగాణ / : మంగళవారం నాడు హైదరాబాద్ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. రేపు ఆఖరి రోజు కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తాజాగా కీలక విజ్ఞప్తి చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మిషన్లతో గాల్లోకి రోడ్లపై రంగుల కాగితాలు ఎగేరేయడం చేయొద్దని కోరింది. "మిషన్లతో గాల్లో రంగుల కాగితాలు ఎగేరేయటం అప్పటికప్పుడు మీకు తాత్కాలికంగా వినోదంగా అనిపించవచ్చు. కానీ ఆ రోడ్లను శుభ్రపరచడంలో భాగంగా ఆ చెత్తను సేకరించడానికి కొన్ని రోజుల సమయం పట్టి చాలా కష్టం అవుతుంది. అలాగే ఆ చెత్త డ్రైనేజీ నీరు పోయే మార్గాల్లో ఇరుక్కుని రోడ్లపై వరదకు కారణమవుతుంది. అందుకే ఇలాంటి రంగుల కాగితాలు లేదా ప్లాస్టిక్‌తో కూడుకున్న రిబ్బన్లను రోడ్లపై ఎగరేయద్దు" అని జీహెచ్ఎంసీ ట్వీట్ చేసింది.
Admin
Studio18 News