Thursday, 12 December 2024 12:34:25 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

YS Jagan : చంద్రబాబు వరదల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు‌.. అందుకే ఆ అరెస్టులు

Date : 11 September 2024 03:08 PM Views : 38

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : YS Jagan Mohan Reddy : సీఎం చంద్రబాబు నాయుడు వరదల నుంచి ప్రజలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు చేశారు. ఆరోజు టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి సీఎంను బూతులు తిట్టారు. ఆగ్రహంతో వైసీపీ కార్యకర్తలు ధర్నాకు వెళ్లారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ కార్యాలయంలో దాడి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నందిగం సురేశ్ ను జగన్ జైలుకెళ్లి పరామర్శించారు. అనంతరం జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారని మండిపడ్డారు. నాలుగేళ్ల క్రితం నాటి కేసును తెరపైకి వచ్చారు. సిట్టింగ్ సీఎంను టీడీపీ నేత దారుణంగా బోసుడీకే అని దూషించాడు. సీఎంగా నన్ను దూషించినా బాబులా కక్ష సాధింపునకు దిగలేదు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు పాలన గాలికి వదిలేశాడు. తుఫాను వస్తుందని ముందే అలర్ట్ వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వరద వస్తుందని తెలుసు. ఆరోజే సమీక్ష చేసి ఉంటే అధికారులను అప్రమత్తం చేసి ఉంటే చర్యలు తీసుకొనే అవకాశం ఉండేదని జగన్ అన్నారు. చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నాడు. బోటు ఓనర్ ఉషాద్రి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.. చంద్రబాబు, లోకేశ్ లతో దిగిన ఫొటోలు ఉన్నాయి. రామ్మోహన్, చిన్నాలు ఎవరు? బోట్లన్నీ టీడీపీ నేతలకు చెందినవే. వాస్తవాలు వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని జగన్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇదే జైల్లో మీరు ఉంటారు.. రెడ్ బుక్ మీకే సొంతం అనుకోవద్దు అంటూ టీడీపీ నేతలను జగన్ హెచ్చరించారు. పెదకూరపాడు వరద ప్రాంతాల్లో పర్యటించడానికి మాజీ ఎమ్మెల్యే శంకర్రావు వెళ్తుంటే దాడి చేశారు. సాంబిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తున్నాను. సాంబిరెడ్డిపై దాడిచేసి చనిపోయాడని తెలుసుకొని వెళ్లారు. చంద్రబాబు చేసిన మోసం తెలుసుకొని ప్రజలు భయటకొస్తున్నారు. సూపర్ సిక్స్ ఏమైంది..? జగన్ ఉండి ఉంటే అన్ని కార్యక్రమాలు అమలయ్యేవి. రైతులకు బీమా సౌకర్యం లేదు.. ఈ క్రాఫ్ లేదు. చంద్రబాబు పాలనలో హాస్టల్స్ లో విద్యార్థులు తినలేక హాస్పటల్స్ లో చేరుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలిపోయింది. సచివాలయ ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నారు. సూపర్ సిక్సా.. అంటే ఏమిటని చంద్రబాబు అడుగుతున్నారు. ఇంటింటికి ప్రచారం చేస్తూ నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు అని చెప్పారు.. ఏమైంది అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు