Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వినూత్నమైన రీతిలో ఫలితాలు సాధిస్తున్న పలువురిని ఔట్‌లుక్ ఇండియా అవార్డులకు ఎంపిక చేసింది. వీరికి ఢిల్లీలో జరిగిన ఔట్‌లుక్ అగ్రిటెక్ సమ్మిట్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేస్ చతుర్వేది అవార్డులు ప్రదానం చేశారు. ఏపీకి చెందిన ముగ్గురికి అవార్డులు దక్కాయి. జాతీయ అత్యుత్తమ కేవీకేగా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఎంపిక కాగా, ఆ కేంద్రం తరుపున శాస్త్రవేత్త జి.ధనలక్ష్మి అవార్డును అందుకున్నారు. అనకాపల్లి కొందంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో సహజ పధ్ధతితిలో వ్యవసాయం, కూరగాయలు, బంతి పండిస్తున్న షేక్ యాకిరిని అవార్డు వరించింది. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన తమ్మినేని మురళీకృష్ణ సహజ పద్ధతుల్లో మిల్లెట్స్ తో బిస్కట్లు తయారు చేసి అవార్డు అందుకున్నారు.
Admin
Studio18 News