Studio18 News - ANDHRA PRADESH / : పల్నాడులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కాన్వాయ్‌పై టీడీపీ కేడర్ దాడికి పాల్పడింది. కర్రలతో వైసీపీ నేతల కార్లపై దాడి చేశారు. 14వ మైలు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఒక కారు అద్దాలు ధ్వంసమైనట్లు సమాచారం. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా 14వ మైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో నంబూరు శంకర్రావు గుంటూరుకు వెళ్లిపోయారు.
Admin
Studio18 News