Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ మంత్రి సంధ్యారాణికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం భూసాయివలసలో జాతీయ రహదారిపై మంత్రి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్ వాహనం టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి ఓ వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు, వ్యానులోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి సంధ్యారాణి మెంటాడ పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన ఎస్కార్ట్ వాహనం వెనుక మంత్రి వాహనం ఉంది. ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైన సమయంలో మంత్రి వాహనం డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. అలాగే ఈ సమయంలో జాతీయ రహదారిపై రాకపోకలు తక్కువగా ఉన్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రి పరామర్శించారు.
Admin
Studio18 News