Studio18 News - ANDHRA PRADESH / : ఆపద మొక్కులవాడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు ఆ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం ప్రతి రోజూ అందుబాటులో ఉంటే బావుంటుందని భావిస్తున్న హైదరాబాద్‌లోని భక్తులకు గుడ్‌న్యూస్ వచ్చింది. శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదం ఇకపై ప్రతి రోజూ నగరంలో అందుబాటులో ఉండనుంది. సిటీలోని హిమాయత్‌నగర్ లిబర్టీ, జూబ్లిహిల్స్‌లోని టీటీడీ దేవస్థానాల్లో ప్రతి రోజూ విక్రయించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50కి ఒక లడ్డూ చొప్పున భక్తులకు శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదం విక్రయించనున్నట్టు ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆలయాల్లో లడ్డూ విక్రయాలు జరుగుతాయని వివరించారు. కాగా గతంలో శనివారం, ఆదివారాల్లో మాత్రమే లడ్డూ ప్రసాదాన్ని విక్రయించేవారు. అయితే శ్రీవారి లడ్డూ విక్రయంలో టీటీడీ నూతన పద్దతిని ఆచరణలోకి తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు.
Admin
Studio18 News