Saturday, 14 December 2024 03:09:00 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

ap floods: వరదల నేపథ్యంలో... ఏపీ ప్రభుత్వానికి వైజయంతీ మూవీస్ విరాళం

Date : 03 September 2024 11:57 AM Views : 39

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : గత దశాబ్దాల కాలంగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కృష్ణానదికి వరద పోటెత్తింది. దాదాపు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహంతో నదీ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. విజయవాడ నగరంతో పాటు ఆనేక గ్రామాల్లో ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల్లో పంట ముంపునకు గురైంది. ఈ నేపధ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్చంద సంస్థలు, ప్రముఖులు, వ్యాపార వాణిజ్య సంస్థలు తమ వంతుగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో 'ఆయ్' చిత్ర బృందం వరద బాధితులకు ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు సోమవారం నుండి వారాంతం వరకూ 'ఆయ్' సినిమాకు రానున్న వసూళ్లలో నిర్మాత షేర్ లో 25 శాతాన్ని జనసేన పార్టీ తరపున విరాళంగా అందిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదే క్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కూడా ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. తమ వంతు సాయంగా సీఎం సహాయ నిధికి రూ.25లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. రేపటి కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. "ఈ రాష్ట్రం మాకెంతో ఇచ్చింది. ప్రకృతి పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇప్పుడు మేం కొంత తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మా బాధ్యత" అని పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు