Studio18 News - ANDHRA PRADESH / : Janasena Party Leader Nagababu : జనసేన కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్ ను నాగబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ కోసం కార్యకర్తలు నిస్వార్ధంగా పని చేశారు. పార్టీకోసం పనిచేసిన వారి కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆయన కష్టార్జితాన్ని బీమా కింద సొమ్మును చెల్లించారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన కార్యకర్తలు కుటుంబాలకు అధినేత అండగా నిలిచారని నాగబాబు చెప్పారు. 17.45కోట్లు ఇప్పటి వరకు బీమా కింద మృతుల కుటుంబాలకు అందజేశామని తెలిపారు.మాది మధ్యతరగతి కుటుంబం, ఎన్నో ఇబ్బందులు చూశాం. అనారోగ్యం పెద్దది అయితే.. చికిత్సకు డబ్బులులేని పరిస్థితి. ఇంటి పెద్దదిక్కు కోల్పేతే ఆ కుటుంబం అనేక పాట్లు పడుతుంది. జనసేన కార్యకర్తలు అలా బాధలు పడకూడదనే పవన్ కల్యాణ్ ఇలా భరోసా ఇచ్చారు. ప్రతిఒక్కరూ నేడు బీమా కట్టుకోవడం అలవాటు చేసుకోండి. పవన్ కళ్యాణ్ మూడు వేల మంది రైతులకు లక్ష చొప్పున ఇచ్చారు. ఒక నిర్మాతగా నేను నష్టపోతే నా తమ్ముడు పవన్ నాకు అండగా నిలిచాడు. నేను కూడా నా వంతుగా ఎంతోకొంత సాయం అందిస్తా. నాకు ఎటువంటి పదవులపై కోరిక లేదు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నిలబెట్టేందుకు నాకు చేతనైనంత చేస్తానని నాగబాబు అన్నారు. నాకు ఓపిక ఉన్నంత వరకు జనసేనకోసం పనిచేస్తా. కూటమి అధికారంలోకి రావడం ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో ప్రజలకు మంచి జరుగుతుందని నాగబాబు చెప్పారు.వైసీపీ వాళ్లు నెల రోజులకే కాట్ల కుక్కలాగా వెంట పడుతున్నారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసి వారిని దారిలో పెడతాం. మీరు చేసిన ప్రతిపనికి సమాధానం చెప్పుకునే రోజు వస్తుందని వైసీపీ నేతలను నాగబాబు హెచ్చరించారు. చేసిన అవినీతి, అక్రమాలకు చట్టపరంగా శిక్ష తప్పదు. జగన్ తన జేబులో నుంచి పది రూపాయలు ఇవ్వలేదు. ఎంతసేపూ దోచుకోవడం, దాచుకోవడమే వారి పని. గత ఐదేళ్లల్లో వారు చేసిన నేరాలు, ఘోరాలు బయట పెడతాం. సీఎంగా అబద్దాలు చెప్పడంలో జగన్ కు డాక్టరేట్ ఇవ్వాలంటూ నాగబాబు విమర్శించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. జరగలేదని జగన్ చెప్పాడు. కల్తీ సారా తాగి చనిపోతే.. సహజ మరణంగా జగన్ ప్రచారం చేశాడు. నేడు ఏపీలో రాష్ట్రపతి పాలన అని అడగటానికి జగన్ కు సిగ్గుండాలి. ఇంతకంటే దిగజారకండి అనిచెప్పే కొద్దీ ఇంకా దిగజారుతున్నారు అంటూ జగన్ తీరుపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణయుగం నడుస్తుంది. కేంద్రం సహకారంతో ప్రజా పాలన అందరూ చూస్తారని నాగబాబు పేర్కొన్నారు.
Admin
Studio18 News