Studio18 News - ANDHRA PRADESH / : ఎన్.సీసీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్ సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో కడప తెలుగుగంగ ఎన్.సీసీ బెటాలియన్ కార్యాలయం వద్ద ఎన్ సీసీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కడప తెలుగుగంగ ఎన్.సీసీ బెటాలియన్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించకూడదని నినాదాలు హోరెత్తించారు. ఫిబ్రవరిలో ఎన్.సీసీ శిక్షణ పూర్తయిన ఇప్పటి వరకు సర్టిఫికెట్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలో ఎన్-రోల్-మెంట్ లేకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్.సీసీ బెటాలియన్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించే నిర్ణయాన్ని వెంటనే వెనిక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని ఎన్.సీసీ విద్యార్థులు హెచ్చరించారు
Admin
Studio18 News