Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. విధినిర్వహణలో ఉన్న కోటేశ్వరరావు అనే విద్యుత్ లైన్ మన్ వరదకు కొట్టుకుపోయి మృతి చెందాడు. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లైన్ కోటేశ్వరరావు కుటుంబానికి సానుభూతి తెలిపారు. భార్య మాధవి, కుటుంబ సభ్యులకు ఆయన ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. లైన్ మన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడలో బుడమేరు ఉప్పొంగి అనేక ప్రాంతాలపై వరద పంజా విసిరిన సంగతి తెలిసిందే.
Admin
Studio18 News