Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లారు. గుజరాత్‌లోని గాంధీ నగర్ లో ఆయన పర్యటించనున్నారు. గాంధీ నగర్‌లో నేటి నుండి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ – 2024 లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లారు. రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్‌లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఈ సదస్సులో చంద్రబాబు వివరించనున్నారు. అలానే ఎనర్జీ రంగంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులతో భేటీ అయి వారితో చర్చలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నందున ఈ సందర్భంలో ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తుంది. అనంతరం రాత్రి 9 గంటలకు చంద్రబాబు అమరావతికి తిరిగి ప్రయాణం కానున్నారు.
Admin
Studio18 News