Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో ఏ6గా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను నిన్న మంజూరు చేసింది. రూ. 2 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, రెండు పూచీకత్తులు ఇవ్వాలని, పాస్ పోర్టును కోర్టుకు అప్పగించాలని, ప్రతి వారం పులివెందుల పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని, సాక్ష్యాలను తారుమారు చేయకూడదని, కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోరాదని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని షరతులు విధించింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే... ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ, వైఎస్ సునీత కోర్టును కోరవచ్చని తెలిపింది. కేసులో కీలక నిందితులు వైఎస్ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు.
Admin
Studio18 News