Wednesday, 10 December 2025 02:41:02 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

ఆరోగ్యశ్రీపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం నమ్మొద్దు: ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్

Date : 02 August 2024 02:01 PM Views : 290

Studio18 News - ANDHRA PRADESH / : satya kumar yadav on aarogyasri: ఆరోగ్యశ్రీ పథకంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. విజయవాడలో శుక్రవారం అవయవదానంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..” రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 45 రోజులే అయింది. అప్పుడే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తీసేస్తారని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది.. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆస్పత్రులకు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. సొంత ఊరులో మాజీ సీఎం మెడికల్ కాలేజీకి పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు.. ఇది మీ పరిస్థితి. మొన్ననే లోకేశ్ జగన్ మోహన్ రెడ్డి కాదని లేవన్ మోహన్ రెడ్డి అన్నారు. తరువాత జీరో జగన్ మోహన్ రెడ్డి అంటార”ని ఎద్దేవా చేశారు. తాను కూడా అవయవదానం చేయనున్నట్టు మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. ”అవయవదానం చేసిన వారికి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. అవయవదానం చాలా ముఖ్యమైనది. ప్రాణం పోసేవాడు దేవుడు.. ప్రాణం నిలిపేవాడు డాక్టర్. అవయవదానం చేసేందుకు గొప్ప మనస్సు ఉండాలి. అవయవదానం చేయడానికి అందరూ ముందుకు రావాలి. అవయవాలు దానం చేసేవారు చనిపోయినా బతికే ఉంటారు. తెలంగాణలో 8 ఏళ్లలో 800 మంది ముందుకు వచ్చారు. ఏపీలో అవయవదానం చేసేవారు తక్కువ మంది ఉన్నారు. దేశంలో 90 వేల మంది అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దేశ వ్యాప్తంగా 5 లక్షలు మంది అవయవాలు లేక చనిపోతున్నారు. అవయవదానం చేసేందుకు మతాలు అడ్డువస్తున్నాయని అంటున్నారు. ప్రతిమనిషి దేవుడితో సమానం. అవయవదానం చేస్తే.. పైన ఉన్న దేవతలు కూడా ఆశీర్వదిస్తారు. అవయవదానం చేసేందుకు ఐపీఎస్, ఐఏఎస్, ఇతర ఉన్నత అధికారులు కూడా ముందుకు రావాలి. అలా చేయడం వల్ల ప్రతిఒక్కరూ ముందుకువచ్చే అవకాశం ఉంది. అవయవదానాన్ని ప్రోత్సహించేలా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయాలి. అంతే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకుల ద్వారా అవగాహన కల్పించాల”ని మంత్రి సత్య కుమార్ యాదవ్ సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :