Monday, 02 December 2024 04:23:16 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: చంద్రబాబుపై పోటీ చేసినందుకే తనపై ఈ దుష్ప్రచారం అంటున్న వైసీపీ ఎమ్మెల్సీ భరత్

Date : 07 August 2024 12:16 PM Views : 90

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమల సిఫార్సు లేఖలను విక్రయించారన్న అభియోగంపై గుంటూరులో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదు కావడం తీవ్ర సంచలనం అయింది. తనపై గుంటూరు అరండల్ పేటలో కేసు నమోదు కావడం, తనపై వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు విక్రయించుకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని ఆయన అన్నారు. తన తండ్రి ఓ ఐఏఎస్ అధికారి అని.. తాను బ్యూరోక్రాట్ కుటుంబం నుండి వచ్చానని చెప్పారు. ఉన్నతమైన విలువలతో తమ కుటుంబం బతుకుతోందని చెప్పారు. తనకు మల్లికార్జునరావు అనే పీఆర్ఓనే లేడని ఆయన పేర్కొన్నారు. మల్లికార్జునరావు అనే ఆ వ్యక్తితో తనకు పరిచయం కూడా లేదని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై పోటీ చేయడంతో పాటు అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడ్డానన్న రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని భరత్ ఆరోపించారు. తనను తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేసిన భరత్ ..తనపై ఫిర్యాదు చేసింది ఎవరు.. పోలీసులు కేసులో పేర్కొన్న వ్యక్తులు ఎవరు అనే విషయాలు అన్నీ ఆరా తీస్తాననీ, పూర్తి వివరాలతో త్వరలో మళ్లీ మీడియా ముందుకు వస్తానని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు