Monday, 02 December 2024 04:23:52 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

YS Jagan: వైసీపీ చీఫ్ జగన్‌కు నోటీసులు ఇచ్చారనే ప్రచారంపై స్పందించిన హైడ్రా కమిషనర్

Date : 31 August 2024 03:46 PM Views : 38

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు నోటీసులు ఇచ్చారని జరుగుతున్న ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. నోటీసులు ఇవ్వలేదని, సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం సాగుతోందని వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని లోటస్ పాండ్ చెరువు శిఖంలో ఇంటిని నిర్మించినట్లు ఆరోపణలు రావడంతో నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం సాగింది. దీనిపై రంగనాథ్ వివరణ ఇచ్చారు. రంగనాథ్ శనివారం ఉదయం పటాన్‌చెరులో పర్యటించారు. అధికారులతో కలిసి స్థానిక సాకి చెరువును పరిశీలించారు. కబ్జాకు గురైన ప్రాంతం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ చెరువులో ఇప్పటికే 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. చెరువు తూములను బంద్ చేసి మరీ నిర్మించిన ఆపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయన్నారు. ఇన్‌కోర్ సంస్థ తూములను బంద్ చేసి అపార్టుమెంట్ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ అపార్ట్‌మెంట్‌ను కూడా రంగనాథ్ పరిశీలించారు. మదీనగూడలో కూల్చివేతలు మదీనగూడలోని వైశాలి నగర్‌లో గల ఈర్ల చెరువు బఫర్ జోన్‌లో నిర్మించిన మూడు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. గగన్ పహాడ్‌లోని అప్పా చెరువులో కూడా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిని ఆక్రమించి నిర్మించిన షెడ్లను, ఇతర నిర్మాణాలను కూల్చివేసింది. బీజేపీ కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డికి చెందిన షెడ్డును కూడా కూల్చివేసింది. వాస్తవానికి అప్పా చెరువు 34 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, కానీ దశాబ్దాలుగా అక్రమ నిర్మాణలు జరగడంతో ఈ చెరువు ఇప్పుడు 10 నుంచి 12 ఎకరాలకు తగ్గిపోయిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. చెరువును ఆక్రమించి నిర్మాణాలు జరగడంతో 2020 అక్టోబర్‌లో వచ్చిన వరదల కారణంగా గణనీయ ఆస్తి నష్టం జరిగిందన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు