Thursday, 12 December 2024 01:41:31 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Chandrababu: అర్ధరాత్రి రిస్క్ చేసిన చంద్రబాబు.. అయినా అధికారుల్లో అదే నిర్లక్ష్యం

Date : 02 September 2024 02:13 PM Views : 36

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : అర్ధరాత్రి పూట వరద నీటిలో ప్రయాణం.. భద్రతా సిబ్బంది వద్దంటున్నా, రిస్క్ అని తెలిసినా వెరవకుండా ఏపీ సీఎం చంద్రబాబు వరద బాధితులను పరామర్శించారు. రిస్క్ తీసుకుని బోటులో ప్రయాణిస్తూ బాధితుల దగ్గరికి వెళ్లారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, భయాందోళనలు అక్కర్లేదని భరోసా కల్పించారు. వరదలో చిక్కుకున్న వారికి ఎప్పటికప్పుడు ఆహారం అందించడంతో పాటు ఇతరత్రా సాయం చేయాలని స్పష్టంగా ఆదేశాలిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. అయినా కొంతమంది అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడలేదు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి గాజులపేటలో వరదలో చిక్కుకుని తిండి, నీళ్లు లేక బాధితులు అలమటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి వారికి ఎలాంటి ఆహారం అందలేదని, అధికారులు ఎవరూ కూడా అటువైపు తొంగిచూడలేదని సమాచారం. ఇదే ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఆదివారం అర్ధరాత్రి పర్యటించారు. బాధితుల కష్టాలను స్వయంగా చూశారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. సీఎం ఆదేశాలతో సోమవారం ఉదయం ఉరుకులు పరుగులు పెట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక బాధితులైతే తీవ్రంగా మండిపడుతున్నారు. తిండి, నీరు అందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు వాకిలి వరదలో మునగడంతో నిరాశ్రయులుగా మారిన పలువురు హైవేలపైనే ఉంటున్నారు. తినడానికి తిండి సంగతి అటుంచి కనీసం కాలకృత్యాలు తీర్చుకునే సదుపాయం కూడా లేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు