Studio18 News - ANDHRA PRADESH / : ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ పేరిట ఈరోజు నోటిఫికేషన్ విడుదలయింది. లేళ్ల అప్పిరెడ్డి నియామకం నిన్నటి నుంచే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ఈ లేఖపై స్పీకర్ ఇంకా తన నిర్ణయాన్ని వెలువరించలేదు.
Admin
Studio18 News