Monday, 02 December 2024 03:34:58 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

సీఎం చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..

Date : 05 September 2024 05:04 PM Views : 46

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Cm Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్‌ పైకి చంద్రబాబు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ట్రాక్‌ పైకి ట్రైన్ వచ్చింది. రైలు చూసి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబును ఆపారు. చంద్రబాబుకు అతి సమీపం నుంచి రైలు వెళ్లింది. బుడమేరు ప్రవాహం సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అయితే, రైలు నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లైంది. సీఎం చంద్రబాబు సేఫ్ గా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రోజూలాగే ఇవాళ కూడా సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. ఈ ఉదయం కూడా ఆయన నిడమానూరు ప్రాంతంలో బుడమేరుకు పడిన గండిన పరిశీలించేందుకు వెళ్లారు. ఆ తర్వాత విజయవాడ సిటీలో ఉండే మధురానగర్ వెళ్లారు. ఈ సమయంలోనే చంద్రబాబుకు వెంట్రుక వాసిలో పెను ప్రమాదం తప్పింది. వరదల పరిస్థితిని, బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు రైలు వంతెనపైకి కాలి నడకన వెళ్లారు. భద్రతా సిబ్బంది వారించినా.. ఆయన వినలేదు. అలాగే రైలు వంతెనపైకి వెళ్లారు. కింద నుంచి చూస్తే బుడమేరులో వరద ప్రవాహం కనిపించలేదు. దీంతో ఆయన రైల్వే ట్రాక్ పై నుంచి పరిశీలన చేసేందుకు వెళ్లారు. రైలు వంతెనపై నడుస్తుండగా.. సడెన్ గా ఎదురుగా ట్రైన్ వచ్చింది. చంద్రబాబుకు అతి సమీపం నుంచి రైలు వెళ్లింది. రైలు తగలకుండా పక్కగా నిలబడంతో చంద్రబాబుకు పెద్ద ప్రమాదమే తప్పింది. ట్రైన్ కి, చంద్రబాబు మధ్య చాలా తక్కువ గ్యాపు ఉంది. రైలు దాటి వెళ్లాక సెక్యూరిటీ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాలకు తెగించి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రైలు వంతెనపైకి ఎక్కారు. అదే సమయంలో ట్రైన్ దూసుకొచ్చింది. ట్రైన్ రాకను గమనించిన చంద్రబాబు ఆఖరి నిమిషంలో అలర్ట్ అయ్యారు. చంద్రబాబు, సెక్యూరిటీ సిబ్బంది అంతా ట్రాక్ పక్కన నిల్చున్నారు. ట్రైన్ వారి పక్క నుంచి వెళ్లింది. తృటిలో పెద్ద గండం తప్పిందని అంతా ఊపిరిపీల్చుకున్నారు. వరద బాధితుల కోసం చంద్రబాబు నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది వారించినా వినకుండా నీళ్లలో తిరుగుతున్నారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోతున్నారు. ప్రజలు కష్టపడుతుంటే చూస్తూ ఉండలేనని చంద్రబాబు చెబుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు