Sunday, 08 March 2026 10:17:49 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

SVIMS: తిరుపతి స్విమ్స్‌లో దారుణం.. వైద్యురాలి జుట్టు పట్టుకుని దాడి చేసిన రోగి..

Date : 27 August 2024 05:06 PM Views : 294

Studio18 News - ANDHRA PRADESH / : కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో ఓ రోగి వైద్యురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఆసుపత్రి మంచానికి ఉండే స్టీల్ ఫ్రేమ్‌కేసి ఆమె తలను బాదాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సహచర వైద్యులు వెంటనే స్పందించి అతడి బారి నుంచి ఆమెను కాపాడారు. శనివారం తాను ఎమర్జెన్సీ వార్డులో విధుల్లో ఉండగా రోగి బంగార్రాజు ఒక్కసారిగా వెనక నుంచి దాడిచేసి తన జుట్టును బలంగా పట్టుకుని ఆసుపత్రి బెడ్‌ స్టీల్ ఫ్రేమ్ కేసి బాదాడాన్ని స్విమ్స్ డైరెక్టర్ కమ్ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆర్‌వీ కుమార్‌కు బాధిత వైద్యురాలు ఫిర్యాదు చేసింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రతను ఈ ఘటన మరోమారు ప్రశ్నార్థకంగా మార్చిందని, నిందితుడి చేతిలో కనుక ఆయుధం ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని బాధిత వైద్యురాలు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన తర్వాత వైద్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదైనదీ, లేనిదీ తెలియరాలేదు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :