Thursday, 12 December 2024 12:41:18 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

huge tree: గోదావరి గట్టున నేల కూలిన భారీ వృక్షం .. దీని ప్రత్యేకత ఏమిటంటే..!

Date : 06 August 2024 11:26 AM Views : 44

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున 150 ఏళ్ల నాటి ఓ భారీ వృక్షం నేలకొరిగింది. దాదాపు 150 ఏళ్లుగా ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలిచిన ఈ నిద్రగన్నేరు చెట్టు సోమవారం పడిపోయింది. గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగాలకు చిరునామాగా ఉన్న ఈ చెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే.. వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు ఈ భారీ వృక్షం వేదికగా నిలిచింది. ప్రముఖ దర్శకుడు బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు తదితరులు ఈ ప్రదేశంలో చిత్రాలను రూపుదిద్దారు. దాదాపు 300కుపైగా సినిమాల్లో పలు సన్నివేశాలు, పాటలను ఈ చెట్టు వద్దే చిత్రీకరించారు. దీంతో ఇది సినీ వృక్షంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్ బాబు తదితరుల సినిమాలలోని పాటల సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. 1976లో వచ్చిన 'పాడి పంటలు' సినిమాతో ఈ వృక్షంకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు తదితర సినిమాల్లో ముఖ్యమైన సీన్ లను ఇక్కడే నిర్మాణం చేశారు. అయితే ఈ సినీ వృక్షం సంరక్షణ విషయంలో పాలకులు, అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద తీసుకోలేదని అక్కడి గ్రామస్తులు చెబుతుంటారు. ప్రతి ఏటా వచ్చే వరదలకు గోదావరి గట్టు కొద్దికొద్దిగా దిగబడి చివరకు చెట్టు మొదలు రెండుగా చీలి సోమవారం పడిపోయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు