Saturday, 14 December 2024 02:49:18 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు

Date : 23 August 2024 03:02 PM Views : 56

Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : Koona Ravi Kumar : ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాంపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లే కాదు.. ఆస్తులకూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం తమ్మినేనికి అలవాటేనని అన్నారు. తమ్మినేని అక్రమాలపై దర్యాప్తుకోసం స్పెషల్ టీం వేయాలని సీఎంను కోరతానని కూన రవి పేర్కొన్నారు. ఆయనకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం అలవాటే. ఆ అలవాటులో భాగంగానే తమ్మినేని ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. తమ్మినేని సీతారాం ఇతర ఆస్తుల పైనా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేశారు. సుమారు 17 ఆస్తులపై డమ్మాబుస్సుల సీతారాం ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడని కూన రవికుమార్ ఆరోపించారు. శ్రీకాకుళంలోనూ.. వివిధ కోర్టుల్లోనూ సీతారాంపై ఫేక్ డాక్యుమెంట్ల కేసులు నడుస్తున్నాయి. ఇసుక తవ్వకాల్లోనూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ మిషన్ల ద్వారా తమ్మినేని ఫేక్ వోచర్లు పుట్టించారు. నకిలీ మిషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఇసుక అక్రమాలపై ఇప్పటికే ఫిర్యాదు చేశాను. డమ్మాబుస్సుల సీతారాంపై నేరాలు – ఘెరాలు అనే ఎపిసోడ్ తీయొచ్చు అంటూ కూన రవికుమార్ ఎద్దేవా చేశారు. రెవెన్యూ సదస్సుల్లో సీతారాం ఫేక్ రెవెన్యూ డాక్యుమెంట్లపై ఫిర్యాదులు వస్తే వాటి మీద చర్యలు తీసుకుంటాం. తమ్మినేని సీతారాం అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని కూన రవికుమార్ పేర్కొన్నారు. తమ్మినేని సీతారాం ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. గత ప్రభుత్వంలోనే నాటి స్పీకర్ తమ్మినేని ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ ద్వారా లా అడ్మిషన్ తీసుకున్నారు. నాటి సీఎం జగన్ దీన్ని పట్టించుకోలేదు. డిగ్రీ చేసినట్టు అంబేద్కర్ యూనివర్శిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ తెచ్చారు. ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని ఓ లా కాలేజీ నుంచి అడ్మిషన్ తీసుకున్నారు. తమ్మినేని ఫేక్ వ్యవహారాన్ని అంబేద్కర్, ఉస్మానియా యూనివర్శిటీలు రెండూ ధృవీకరించాయి. తమ్మినేని ఫేక్ వ్యవహరంపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశాను. తమ్మినేని మీద సీఎస్ కు ఫిర్యాదు చేయాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి నాకు సమాచారం అందింది. ఈ మేరకు సీఐడీతో విచారణ చేయించాలని సీఎస్ కు ఫిర్యాదు చేశాను. తమ్మినేని ఫేక్ వ్యవహరం రెండు రాష్ట్రాలకు చెందిన అంశం.. అందుకే సీఐడీతో విచారణ జరిపించాల్సి ఉంటుంది. త్వరలోనే సీఐడీ చీఫ్ అయ్యన్నార్ ను కలిసి కంప్లైంట్ చేస్తాను. స్పీకర్ గా వ్యవహరించిన వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తే ఊపేక్షించకూడదు. సీఎస్, సీఐడీ విచారణ చేపట్టకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కూన రవికుమార్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు