Wednesday, 10 December 2025 01:59:24 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వైసీపీ శ్రేణులపై దాడులను ఆపాలి.. : సామినేని ఉదయభాను

Date : 04 August 2024 02:40 PM Views : 226

Studio18 News - ANDHRA PRADESH / : Samineni Udaya Bhanu :ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేటకు చెందిన వైసీపీ కార్యకర్త గింజుపల్లి శ్రీనివాసరావుపై దాడి జరిగింది. ప్రత్యర్థులు కారుపై దాడి చేసి అతణ్ని తీవ్రంగా గాయపర్చారు. దీంతో స్థానికులు శ్రీనివాసరావును జగ్గయ్యపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. తాజా ఘటనపై మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ జరిగిన నాటి నుంచి టీడీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మాదే ప్రభుత్వం.. మాదే రాజ్యం అనేలా విర్రవీగుతున్నారు. గత ఐదేళ్లలో జగ్గయ్యపేటలో టీడీపీ నేతలపై ఒక్క కేసు లేదు. ఈ రెండు నెలల్లో వైసీపీకి చెందిన 15 మందిపై దాడులు చేశారు. రోడ్డు పై ఎవరూ తిరగకూడదనేలా వ్యవహరిస్తున్నారని సామినేని ఉదయభాను అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.. గింజుపల్లి శ్రీనివాసరావు తండ్రి వీరయ్య మంచి నాయకులు. ఇందిరమ్మ ఇళ్లు కట్టినందుకు వైఎస్సార్ వీరయ్యను సన్మానించారు. 2009లో వీరయ్యను ఆనాడు టీడీపీ నేతలు పొట్టనపెట్టుకున్నారు. తండ్రిని చంపిన వారే ఈరోజు శ్రీనివాసరావును హతమార్చాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరయ్య హత్యలో ప్రస్తుత జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోదరుడు ధనుంజయ్ కూడా ఒక ముద్దాయి. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే సోదరుడి రౌడీయిజం ఎక్కువై పోయింది. వైసీపీ వాళ్లను కొట్టండి.. చంపండి.. కేసులు లేకుండా చూసుకుంటానని చెబుతున్నాడు. పక్కాగా రెక్కీ నిర్వహించి శ్రీనివాసరావును చంపాలని చూశారు. మేం దాడులు చేయం.. హింసను ప్రోత్సహించమని సీఎం చంద్రబాబు నాయుడు ఒకపక్క పదేపదే చెబుతున్నారు. కానీ, టీడీపీ నేతలు.. శ్రేణులు దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే దాడులను నిలువరించాలి. దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు. వీరయ్య హత్య కేసులో సీబీసీఐడీ కేసు నుంచి సాక్షులను తొలగించారు. పోలీసులే ఛార్జిషీట్ వేసి కేసును దర్యాప్తు చేయాలి. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే దాడులను ఆపాలి.. నిందితులను శిక్షించాలని ఉదయభాను కోరారు. ఏ దాడి జరిగినా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారు. చాలా ఘటనల్లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. పోలీసులను అడిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం.. స్తామంటున్నారు. గతరాత్రి ఘటనలో అరెస్ట్ చేసిన వారిని కేసు తేలేవరకూ విడిచిపెట్టొద్దని డిమాండ్ చేస్తున్నాం. శ్రీనివాసరావు సోదరుడు గింజుపల్లి మధు మాట్లాడుతూ.. టీడీపీ గెలిచిన రోజు నుంచి నవాబ్ పేటలో టీడీపీ దాడులు పెరిగిపోయాయి. ఫ్యాక్షన్ తరహాలో దాడులు చేస్తున్నారు. నా తండ్రిని చంపిన ముద్దాయిలే ఈ దాడులకు కారణం. నా తండ్రి హత్య కేసును పోలీసులే ఛార్జిషీట్ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :