Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : అమరావతి : పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ దాడుల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పహల్గామ్ బాధిత కుటుంబ సభ్యులు( Pahalgam victims ) స్పందించారు. ఉగ్రవాదుల చేతిలో మరెవరు కూడా ప్రాణాలు కోల్పోకుండా , ఉగ్రవాదులు అనేవారు లేకుండా భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్( Operation Sindoor ) పై నెల్లూర్‌కు చెందిన మధుసూదన్‌రావు కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఘటనలో మరణించిన మధుసూదన్‌రావు తల్లి పద్మావతి మాట్లాడుతూ నా కడుపు కోత ఏ తల్లికి రాకుండా ఉగ్రవాదులను అంతం చేయాలని అన్నారు. తమ కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారని కొడుకును తలుచుకుని రోధించారు. మధుసూదన్ సోదరి విజయలక్ష్మి , మధుసూదన్ మామ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం తమ కుటుంబానికి ఊరట కలిగిస్తోందని తెలిపారు. ఇప్పటికీ తమ సోదరుడి మరణం షాక్ నుంచి తేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
Studio18 News