Sunday, 08 March 2026 03:21:21 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Telugudesam: కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ షాక్

Date : 08 October 2024 11:52 AM Views : 328

Studio18 News - ANDHRA PRADESH / : వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం పురపాలక సంఘం రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. ఈ పురపాలక సంఘాన్ని చేజిక్కించుకోవడంపై టీడీపీ కన్నేసింది. ఈ మేరకు వ్యూహాత్మకంగా పావులు కదపడంతో పురపాలక ఛైర్మన్‌ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి సోమవారం టీడీపీలో చేరారు. ఇదివరకే కొందరు కౌన్సిలర్లు చేరగా తాజాగా చేరిన వారితో కలుపుకొని టీడీపీ సంఖ్యా బలం 10కి పెరిగింది. ఫలితంగా వైసీపీ సంఖ్యా బలం 8కి తగ్గింది. దీంతో కమలాపురం పురపాలక పీఠం దాదాపు అధికార పార్టీ వశమైనట్టే. త్వరలో జరిగే పురపాలక సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో కమలాపురం వైసీపీ శాసనసభ్యుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డికి భారీ షాక్ తగిలినట్టు అయింది. వైసీపీ చేతిలోంచి ఈ పురపాలక సంఘం టీడీపీ ఖాతాలో పడబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చాయని, అందుకే పార్టీ మారుతున్నట్టు పురపాలక సంఘం చైర్మన్ మర్పూరి మేరీతో పాటు కౌన్సిలర్లు చెప్పారు. ఇక టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి నాయకత్వంపై నమ్మకం ఉండడంతో పార్టీ మారామని పేర్కొన్నారు. మరోవైపు ఇంకొందరు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :