Studio18 News - ANDHRA PRADESH / : పాక్ ప్రేరేపిత ఉగ్ర శిబిరాలపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూరు ( Operation Sindoor) ను విజయవంతంగా నిర్వహించడం పట్ల ఏపీ కేబినెట్ ( AP Cabinet) అభినందిస్తూ తీర్మానం చేసింది. గురువారం ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ కీలక అంశాలపై చర్చించి తీర్మానం చేసింది. మంగళవారం రాత్రి భారత ఆర్మీ ( Bharat Army ) పాకిస్తాన్‌లోని 9 ఉగ్రశిబిరాలపై చేసిన దాడులు విజయవంతంకావడం పట్ల త్రివిధ దళాలకు అభినందనలు తెలిపింది . తీర్మాన ప్రతిని కేంద్రానికి పంపించనున్నామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది. 47వ సీఆర్డీయే సమావేశంలో నిర్ణయాలకు,రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదతర సంక్షేమ కార్యక్రమాలపై సుధీర్ఘంగా కేబినెట్‌లో సమావేశం జరిగింది. తీరప్రాంత భద్రత, రక్షణరంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.
Admin
Studio18 News