Tuesday, 31 March 2026 04:29:54 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Kanaka Rao: సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం ఇవ్వడంపై టీడీపీ నేతల తీవ్ర అసంతృప్తి

Date : 27 January 2026 06:57 PM Views : 64

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కనకారావు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపణలు టీడీపీ కార్యకర్తలపైనే కేసులు పెట్టారని తెలుగు తమ్ముళ్ల మండిపాటు పక్షపాత పోలీసింగ్‌కు గుర్తింపు ఇవ్వడమేంటి? అని ప్రశ్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా గన్నవరం సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం ఇవ్వడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఆ ఘటనలో నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి, కార్లకు నిప్పంటించి పార్టీ ఆఫీస్‌ను పూర్తిగా దగ్ధం చేశారు. అయితే, అప్పటి సీఐ కనకారావు, గన్నవరం పోలీసులు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, తమ పార్టీ నేతలపైనే కేసులు నమోదు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం టీడీపీ నేతలు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట ఘర్షణకు దారితీసింది. వైసీపీ నాయకులు రాళ్లు రువ్వడంతో సీఐ కనకారావుకు తలకు గాయమైంది. కానీ, దాడికి కారణమైన వైసీపీ నేతలను వదిలేసి టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. మరోవైపు, నాడు మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబు టీడీపీ కార్యాలయం దగ్ధమైన విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి గన్నవరం రాగా, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ జాషువా ఎయిర్‌పోర్ట్ ముందు భారీ వాహనాలను అడ్డుపెట్టి చంద్రబాబును గన్నవరం రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం నాడు సీఐ కనకారావుకు ప్రశంసాపత్రం ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. "దాడి చేసినవారిని వదిలేసి, టీడీపీ నేతలపై కేసులు పెట్టిన అధికారికి ఇప్పుడు ప్రశంసలా? ఇది న్యాయమా?" అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. "పక్షపాత పోలీసింగ్‌కు గుర్తింపు ఇవ్వడమేంటి?" అని మండిపడుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :