Thursday, 12 March 2026 12:26:51 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Btech Ravi: వివేకా కేసులో మరో మలుపు.. జైల్లో దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించిన ఘటనపై బీటెక్ రవి వాంగ్మూలం

Date : 22 October 2025 07:29 PM Views : 156

Studio18 News - ANDHRA PRADESH / Kurnool : దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించడం చూశానన్న బీటెక్ రవి ఈ ఘటనపై కర్నూలు ఎస్పీకి వాంగ్మూలం ఇచ్చినట్లు వెల్లడి గతేడాది నవంబర్ 28న ఘటన జరిగిందని స్పష్టీకరణ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని... ఈ కేసు నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలులోనే బెదిరించారని, ఈ ఘటనను తాను ప్రత్యక్షంగా చూశానని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపుల కేసుకు సంబంధించి ఆయన తన వాంగ్మూలాన్ని పోలీసులకు అందజేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈరోజు కడప జైలును సందర్శించారు. దస్తగిరిని బెదిరించిన సమయంలో వేరే కేసులో బీటెక్ రవి కూడా అదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, సాక్షిగా ఉన్న రవిని ఎస్పీ విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. "పోలీసులు విచారణకు పిలవడంతో హాజరై, కర్నూలు ఎస్పీకి నా వాంగ్మూలం ఇచ్చాను. 2023 నవంబర్ 28న దస్తగిరి ఉంటున్న బ్యారక్‌లోకి చైతన్య రెడ్డి వెళ్లడం నేను స్పష్టంగా చూశాను. నా బ్యారక్ సరిగ్గా దానికి ఎదురుగానే ఉంది" అని బీటెక్ రవి తెలిపారు. "వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న వ్యక్తి బ్యారక్‌లోకి నిందితుడి కుమారుడిని ఎలా అనుమతిస్తారని ఆరోజే జైలు అధికారి ప్రకాశ్‌ను ప్రశ్నించాను. కానీ, అధికారులు నా మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆరోజు ఏం జరిగిందనేది ఎస్పీకి కూలంకషంగా వివరించాను. జైలుకు వచ్చి మరీ దస్తగిరిని బెదిరించడం వెనుక పెద్ద కుట్ర ఉందని నేను భావిస్తున్నాను" అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :