Monday, 17 February 2025 03:22:10 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Balka Suman: జగన్ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఏమైంది?: తెలంగాణ పోలీసులకు బాల్క సుమన్ హెచ్చరిక

Date : 04 October 2024 05:00 PM Views : 98

Studio18 News - ANDHRA PRADESH / : ఏపీలో జగన్ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఐపీఎస్‌ల పరిస్థితి ఏమైంది? తప్పు చేసిన పోలీస్ అధికారులను చంద్రబాబు వచ్చాక ఇంటికి పంపించారనే విషయం గుర్తుంచుకోవాలి... అంటూ తెలంగాణ పోలీసులు, అధికారులకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ హెచ్చరించారు. ఏపీలో చేసిన తప్పుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చెన్నూరు నియోజకవర్గానికి ఉపఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. సూట్ కేస్ కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో చెన్నూరు ఎమ్మెల్యే జైలుకు పోవటం‌ ఖాయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాదు కదా... భగవంతుడు కూడా వివేక్‌ను కాపాడలేరన్నారు. ఈడీ కేసు కొనసాగుతుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వివేక్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు వెళతామన్నారు. వివేక్ ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. తెలంగాణ పోలీసులకు స్వామిభక్తి ఎక్కువైందని... రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు భవిష్యత్తులో బలికాక తప్పదని హెచ్చరించారు. ఈడీ విచారణ జరుగుతోన్న కేసును పోలీసులు ముగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీలోని తాజా పరిణామాలను తెలంగాణ పోలీసులు గమనించాలని హితవు పలికారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు