Studio18 News - ANDHRA PRADESH / Visakhapatnam : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర శాసనమండలి సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు దువ్వారపు రామారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 27న గుంటూరులో నిర్వహించే దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలకు విశాఖ నగరం నుండి పలువురు బీసీ నేతలు తరలి వెలుతున్నారు. ఈ మేరకు విశాఖ నగరంలో సమావేశమైన వారు దువ్వారపు రామారావు జన్మదిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం బీసీ నేత, సమాజ సేవ తత్పరులు, ప్రముఖ వ్యాపార వేత్త తుమ్మిడి రామ్ కుమార్ నేతృత్వంలో మీడియాతో మాట్లాడుతూ బీసీల ఆశాజ్యోతి ,బడుగు బలహీన వర్గాల కోసం పరతపించే మహోన్నతమైన వ్యక్తి దువ్వారపు రామారావు జన్మదినం సందర్భంగా పలు సామాజిక, సేవ కార్యాక్రమాలను నిర్వహించడంతో పాటూ గుంటూరు నగరంలో నిర్వహించనున్న దువ్వారపు రామారావు జన్మదిన వేడుకలలో పాల్గోనడానికి తరళి వెళ్లనున్నట్లు పేర్కోన్నారు. నిరంతరం ప్రజలకు సేవచేయాలన్న సంకల్పంతో బడుగు, బలహీన వర్గాల వారికి వెన్నుదన్నుగా నిలుస్తూ మనవత్వానికి, మంచిపేరుకి చిరునామాగా నిలుస్తున్న శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాల్ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు బీసీ సంఘాల నేతలు తదితరులు పాల్గోన్నారు.
Admin
Studio18 News