Tuesday, 31 March 2026 04:31:45 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

KCR: ఫాంహౌస్ లో కేసీఆర్ తో సమావేశమైన కేటీఆర్

Date : 30 January 2026 06:55 PM Views : 94

Studio18 News - ANDHRA PRADESH / HYDERABAD : ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కొనసాగుతున్న భేటీ మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులపై కొనసాగుతున్న చర్చ నిన్న కేసీఆర్ తో భేటీ అయిన హరీశ్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో వీరి భేటీ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ తో నిన్న హరీశ్ రావు భేటీ అయిన సంగతి తెలిసిందే. సిట్ అడిగే ప్రశ్నలు, సమాధాలు ఇచ్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ కు అందిన నోటీసులను ఎలా ఎదుర్కోవాలి, ఈ విషయాన్ని పార్టీకి నష్టం కలగకుండా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై నిన్న హరీశ్ తో, ఈరోజు కేటీఆర్ తో చర్చిస్తున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా ఎలాంటి అడుగులు వేయాలి, ఎలాంటి ప్రజా ఉద్యమాలను నిర్మించాలి, మీడియా ముందుకు ఎలాంటి అంశాలను తీసుకెళ్లాలనే అంశాలపై చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ దూకుడు తగ్గించాలనే పట్టుదలతో ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :