Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : 'గుడ్ మార్నింగ్ ధర్మవరం' కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కేతిరెడ్డి స్పందిస్తూ... తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో నిజం లేదని చెప్పారు. 35 ఏళ్లుగా తమ కుటుంబం వైఎస్ కుటుంబంతోనే ఉందని తెలిపారు. ఇకపై కూడా ఆ కుటుంబంతో కలిసే ప్రయాణిస్తామని చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే నడుస్తానని, వైఎస్ కుటుంబానికి తోడుగా ఉంటానని తెలిపారు. జగన్ కుటుంబ సభ్యులే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని... కానీ, తాము మాత్రం జగన్ తోనే ఉంటామని చెప్పారు. పదవుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని... తనను నమ్ముకున్న వారి కోసమే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు.
Admin
Studio18 News