Sunday, 08 March 2026 04:19:34 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

మాకు సంబంధంలేదని ఆ చానెల్ తప్పించుకోలేదు: పవన్ కల్యాణ్

Date : 08 June 2025 05:37 PM Views : 170

Studio18 News - ANDHRA PRADESH / : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఒక టెలివిజన్ ఛానెల్‌లో విశ్లేషకుడి ముసుగులో ఒక వ్యక్తి చేసిన తీవ్ర వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమరావతి ప్రాంత మహిళలను, ఈ నేల చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. "ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దు. ఆ ఛానెల్ కూడా... ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, అవి సదరు వ్యక్తి అభిప్రాయం, మాకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకోలేదు. వాటిని ప్రసారం చేయడమే కాదు... చర్చ సందర్భంలో కనీసం ఖండించి, తప్పుబట్టలేదు. అంటే ఆ చర్చ వెనుక... నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న మహిళలను, ఈ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని, విలసిల్లిన బౌద్ధాన్నీ అవమానించి అవహేళన చేయాలనే కుటిల యత్నం దాగి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలి" అని స్పష్టం చేశారు. •ఆచార్య నాగార్జునుడు కాలంలో విలసిల్లిన బౌద్ధం అమరావతిపై నీచ ప్రచారానికి దిగిన వ్యక్తులకు, ముఠాలకు కనీసం ఆ ప్రాంత చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక విశేషాలు కూడా తెలియవు అనిపిస్తోంది. మౌర్యులు, ఇక్ష్వాక రాజుల శాసనాలు లభ్యమయ్యాయి. కాకతీయులు ఈ ప్రాంతంలో శాసనాలు వేయించారు. బౌద్ధం విలసిల్లిన నేల అని చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ రచనలు చెబుతున్నాయి. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రాంతమిది. మహాయాన బౌద్ధం ముఖ్య సంప్రదాయంగా ఆ ధర్మం విస్తరించింది. ఆ సంప్రదాయంతోపాటు ఇతర సంప్రదాయాలూ ఇక్కడ ఆదరణ పొందాయి. కాబట్టే ఈ ప్రాంతాన్ని బౌద్దులు పవిత్రంగా భావిస్తారు. నాటి అమరావతి శిల్పకళారీతి.. బౌద్ధం విస్తరించిన శ్రీలంక, ఆగ్నేయాసియా దేశాల్లో అదరణ పొందింది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతంపై నీచ వ్యాఖ్యలు చేసే వ్యక్తులు- ఆ ధర్మాలను విశ్వసించేవారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కుల ముద్రలు వేశారు... మహిళలను అవమానిస్తున్నారు రాజధానిపై గత పాలకుడు, ఆయన సహచరులు కుత్సితమైన వ్యాఖ్యలు చేస్తూ అమరావతి ప్రతిష్ఠను దిగజార్చాలని చూశారు. రాజధానిని శ్మశానంతో పోల్చారు. కుల ముద్ర వేశారు. భూములు ఇచ్చిన రైతులు దీక్షలు చేస్తే తమ రాజకీయ బలంతో అణచివేసే ప్రయత్నం చేసి కేసులుపెట్టి వేధించారు. రాజధాని కోసం భూములు ఇచ్చినవారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల రైతులు ఉన్నారు. తాము భూములు ఇచ్చాము, రాజధాని ఇక్కడే ఉండాలని దీక్షలు చేసిన సదరు సామాజిక వర్గంవారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించి ఇక్కట్ల పాల్జేసింది గత ప్రభుత్వం. 14 శాతం బీసీ రైతులు, 20 శాతం రెడ్డి సామాజిక వర్గం, 18 శాతం కమ్మ, 9 శాతం కాపు, 3 శాతం ముస్లిం రైతులు భూములు ఇచ్చారు. టీవీ ఛానెల్ ద్వారా రాజధాని ప్రాంత మహిళలపై నీచ వ్యాఖ్యలు చేయించారు. అంటే అక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాల మహిళలందరినీ అవమానించడమే కదా? అమరావతి ప్రాంత చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను అవహేళన చేయడమే కదా? ఈ ప్రాంతంపై కక్షపూరితంగా, ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతంపై చెడు ముద్ర వేయడమే ఆ ముఠా దురుద్దేశంగా కనిపిస్తోంది. ఈ విధంగా కుట్రలు చేసి దుష్ప్రచారం చేసిన వ్యక్తులపైనా, వారి వెనుక ఉన్నవారిపైనా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. నీచ వ్యాఖ్యలు చేసినవారిపై చట్ట ప్రకారం చర్యలకు పోలీసులు ముందుకు వెళతారు" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :