Thursday, 12 March 2026 12:52:06 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Kailasagiri: విశాఖలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం

Date : 01 December 2025 06:15 PM Views : 139

Studio18 News - ANDHRA PRADESH / AMARAVATI : కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం హాజరైన ఎంపీ భరత్, ఎమ్మెల్యే రామకృష్ణబాబు రూ. 7 కోట్లతో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం విశాఖలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. సుమారు రూ. 7 కోట్ల నిధులతో ఈ గ్లాస్ బ్రిడ్జిని కైలాసగిరిపై నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి 40 ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్ గాజును వినియోగించారు. ఈ గాజును జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. గ్లాస్ బ్రిడ్జ్ ఒకేసారి 500 టన్నుల బరువు మోయగలదు. 250 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఒకేసారి 40 మంది ఎక్కవచ్చు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ... పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకుని నిలబడేలా గ్లాస్ బ్రిడ్జిని నిర్మించామని తెలిపారు. కైలాసగిరిపై త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :