Wednesday, 04 March 2026 08:46:17 AM
# Ambati Rambabu: అంబటి రాంబాబుకు రెండో షాక్... మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు # Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా? # Revanth Reddy: బీజేపీకి లైఫ్ లైన్ అసదుద్దీన్ ఒవైసీయే.. ఆయనే వారికి దేవుడు: రేవంత్ రెడ్డి # Chandrababu: క్షేత్రస్థాయిలో పర్యటించండి... విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు: సీఎం చంద్రబాబు # Surekha Vani: అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలి: సురేఖ వాణి కూతురు సుప్రీత # Chandrababu: ఉత్పత్తులకు బ్రాండింగ్, నాణ్యతే ముఖ్యం: సీఎం చంద్రబాబు # Revanth Reddy: మోదీ కచ్చితంగా బడాబాయే.. టీన్యూస్ జర్నలిస్టు ముఖంలో కేసీఆర్‌ను చూడలేను కదా: రేవంత్ రెడ్డి # Punjab: క్లాస్‌రూంలో దారుణం.. క్లాస్‌మేట్‌ను కాల్చి చంపి.. తనూ కాల్చుకున్న విద్యార్థి # Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు # Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పెళ్లిపై మీడియా ప్రశ్న... స్పందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ # EPFO: పీఎఫ్ డబ్బులు ఇక యూపీఐతోనే.. ఏప్రిల్ నుంచి కొత్త సేవలు! # Prakash Raj: 'స్పిరిట్' నుంచి తొలగించారన్న వార్తలపై ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ # Telangana Municipal Elections: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి పోలింగ్ # Ali Khamenei: 37 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ # AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా కలెక్టర్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి వినతిపత్రం

Date : 26 December 2025 07:44 PM Views : 171

Studio18 News - ANDHRA PRADESH / Anantpur : సుబ్బరాయ సాగర్ కు వెంటనే నీటిని విడుదల చేయాలన్న జేసీ పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన పెనకచర్ల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలని విన్నపం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా పుట్లూరు మండల రైతుల సమస్యలను నేరుగా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. పుట్లూరు మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్బరాయ సాగర్‌కు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ ను కలిసిన అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు నెలల క్రితం సుబ్బరాయ సాగర్‌లో సుమారు 11.4 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే గేట్లు తెరుచుకోకపోవడం వల్ల 29వ డిస్ట్రిబ్యూటర్ వద్ద నుంచి బొప్పేపల్లి చెరువుకు నీటిని మళ్లించాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో పుట్లూరు మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి చెరువులు నీటితో నిండకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని జేసీ పేర్కొన్నారు. సాగునీరు అందక పంటలపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుతం సుబ్బరాయ సాగర్ గేట్లకు అవసరమైన మరమ్మత్తులు పూర్తయ్యాయని, ఇక ఆలస్యం చేయకుండా పెనకచర్ల డ్యామ్ నుంచి సుబ్బరాయ సాగర్‌కు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. నీరు విడుదల చేయకపోతే పుట్లూరు మండల రైతులు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ ఆనంద్ సానుకూలంగా స్పందించారని జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. తాను రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక రైతుగా కలెక్టర్‌ను కలిశానని, ఈ అంశాన్ని దయచేసి రాజకీయంగా మలచొద్దని కోరారు. పుట్లూరు మండలంలో తనకు స్వంత భూమి ఉందని, రైతుల బాధ తనకు తెలుసని ఆయన స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీతో పుట్లూరు మండల రైతుల్లో కొంత ఆశాభావం వ్యక్తమవుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :