Studio18 News - ఆంధ్రప్రదేశ్ / : టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నగరంపాలెం పీఎస్ లో దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని జీఏడీ రాజకీయ కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.1695 తీసుకువచ్చింది. అభియోగాలపై వివరణ ఇచ్చే క్రమంలో, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసినా పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సునీల్ కుమార్ తన వివరణను లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Admin
Studio18 News