Thursday, 12 March 2026 01:30:47 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Ram Gopal Varma: పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాలనే డిమాండ్ పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు

Date : 09 February 2026 06:55 PM Views : 34

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : సోషల్ మీడియా అంటే కేవలం కాలక్షేపం కాదన్న ఆర్జీవీ అది జ్ఞాన భాండాగారమని వ్యాఖ్య సోషల్ మీడియాను నిషేధిస్తే పిల్లలు వెనుకబడిపోతారన్న వర్మ సోషల్ మీడియా ఇప్పుడు జనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది లేకుండా జనాలు కొంత సమయం కూడా గడిపే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న పిల్లలు సైతం దీనికి బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా పలు దేశాలు నిషేధం విధించే దిశగా వెళుతున్నాయి. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలనే డిమాండ్ ఇండియాలో కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా అంటే కేవలం కాలక్షేపం కాదని, అది జ్ఞాన భాండాగారమని ఆర్జీవీ అన్నారు. ఇతర దేశాల్లో పిల్లలు రెడ్డిట్, యూట్యూబ్ వంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా కోడింగ్, సైన్స్ నేర్చుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నారని... మనం ఇక్కడ సోషల్ మీడియాపై నిషేధం విధిస్తే... మన పిల్లలు పోటీలో వెనుకబడిపోతారని చెప్పారు. మన పిల్లల జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్లమవుతామని అన్నారు. కొందరు చేసే తప్పులకు మొత్తం టెక్నాలజీని నిషేధించడం సరికాదని చెప్పారు. రక్షణ పేరుతో పిల్లలకు ఇన్ఫర్మేషన్ అందకుండా ఆపేస్తే... వారి జీవితం అంధకారం అవుతుందని అన్నారు. కెరీర్ బాగుండాలంటే డిజిటల్ ప్రపంచంపై పట్టు ఉండాలని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :